ఏ పరిశ్రమలో అయినా కరోనా పాజిటివ్ వస్తే ఆ పరిశ్రమను మూసివేస్తామని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రావు. విశాఖ లో జరిగిన ప్రమాదం దృష్ట్యా పరిశ్రమల భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, కోరమాండల్, ఎన్ఎప్సీయల్, తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర పదార్ధాలు కలిగిన 21 పరిశ్రమలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
వారంలోగా ఈ పరిశ్రమలు సేప్టీ ఆడిట్‌పై నివేదిక ఇవ్వాలి. మాక్ డ్రిల్స్‌ను నిర్వహించి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ ఉండే ప్రజలు ఎలా రక్షణ పొందాలనేదానిపై అవగాహన కల్పించాలన్నారు. సైరన్ పని చేస్తుందో లేదో తనిఖీ చేయాలని సూచించారు. లాక్‌డౌన్ పరిస్ధితుల వల్ల ఇతర ప్రాంతాల నుండి నిపుణులు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అందువల్ల మనమే ప్రమాదాన్ని త్వరగా నివారించేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.