ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండులో 91% స్వచ్ఛమైన నీరు మిగతావన్నీ ఆరోగ్యకరమైన కరగని ఫైబర్ ఉంటుంది. అంతే కాకుండా అనేక రకాల పోషకాలు ఉంటాయి. తగినంత నీరు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
దోసకాయలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు …గుడ్డు మీకు ఇష్టమైన ఆహారం అయితే మీరు పచ్చసొన వదిలేసి తెల్లసొనను ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. దీనివల్ల శక్తి రావడంతో పాటు ఎటువంటి నష్టం జరగదు. వెల్లుల్లి కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
Advertisements
కిడ్నీ సమస్యలు వచ్చిన వారు ఉప్పు తినకూడదు కాబట్టి ఆ స్థానాన్ని వెల్లుల్లి భర్తీ చేస్తుంది. రుచితోపాటు వెల్లుల్లి ఆహారానికి వాసనను కూడా ఇస్తుంది. కాలీఫ్లవర్ లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.