• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పదవి భిక్ష కాదు…గులాబీ జెండా ఓనర్లం!

Published on : August 29, 2019 at 2:54 pm

eatala rajendar

మంత్రి ఈటెల వేడి వ్యాఖ్యలు

మంత్రి పదవి తనకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌లో చేరికల సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తన మంత్రి పదవిపై చిల్లర వార్తలు ప్రచారంలో ఉన్నాయని…వాటికి బదులివ్వాల్సిన అవసరం లేదని అన్నారాయన. తెలంగాణలో చేసిన ఉద్యమమే తనను మంత్రిని చేసిందని చెప్పారు.  ఈటల రాజేందర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.

కొడకా.. కులంతో కొట్లాట పెట్టి మంత్రి కాలే!
“అనామక మనిషిగా వచ్చి… ఈ గడ్డ మీద ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఓ చరిత్ర. నా తల్లిదండ్రులు రాజకీయాల్లో లేరు. నాకు నేనుగా నిలబడ్డా. నాకు నేనుగానే నిలబడతా. ఒక్క హుజూరాబాదే కాదు.. నేను ఆదిలాబాద్‌కు పోయినా పదిమంది వచ్చి ఫొటో దిగి పోతరు. నేను మహబూబ్ నగర్ పోయినా.. వ్యాన్‌లలో వచ్చి.. పదిమంది ఫొటో దిగి పోతరు. మేం కొన్ని లక్షల మందితో కలిసి తెలంగాణ గడ్డపై ఉద్యమం చేసిన బిడ్డలం మేం. ఒక పత్రిక రాస్తది.. ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే.. ఈ మంత్రి పదవే ముఖ్యమా.. కొడకా.. కులంతో కొట్లాట పెట్టలే. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడినం. తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడిన తప్ప.. కులంతో వచ్చినవాడిని కాదు నేను. ఈటల రాజేందర్ అనేవాడు.. తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన బిడ్డ. ఈ బిడ్డను ఆనాడు జైళ్లలో, పీడీ యాక్టులు పెట్టాలె అని ముఠాలు కట్టిన్రు. నన్ను చంపాలి అని రెక్కీలు నిర్వహించినప్పుడు సంపుతవా నా కొడకా అని ఛాలెంజ్ చేసిన తెలంగాణ బిడ్డను నేను. ఇవాళ పైసల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ పైసలెట్లనో.. ఆనాడు కూడా పైసలుండె.

ఆనాడు వైఎస్ కు బెదరలే.. ఛాలెంజ్ చేశా
ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డినే ఛాలెంజ్ చేశాను. పార్టీ మాత్రం మారలేదు. ఈ ఈటల రాజేందర్ తెలంగాణ విముక్తి పోరాటం వల్ల గెలిచాడు తప్ప.. నాకు నేనుగా గెలవలేదు అని వైఎస్‌కు చెప్పాను. ఉద్యమ పుణ్యాన గెలిచాను తప్ప.. సొంతంగా గెలవలే అని చెప్పాను. నన్ను చంపుతామని ఉద్యమ సమయంలో రెక్కీ నిర్వహించినప్పుడు చంపినా పర్వాలేదు..కానీ తెలంగాణ జెండా మాత్రం వదిలేదు అని నేను కొట్లాడాను” అన్నారు ఈటల

గులాబీ జెండా ఓనర్లం మేం..
పదవులు నాకు భిక్ష కాదు..
“చెప్పాలంటే 10 గంటలు చెప్తా. ఒక్కోరోజు 4 , 4 జిల్లాల్లో .. 20, 20 సభల్లో లక్షల మందితో ఇంటరాక్ట్ అయి.. ఉద్యమాన్ని నడిపిన వాళ్లం మేం. ఈ గులాబీ జెండాకు ఓనర్లం మేం. అడుక్కుని వచ్చిన వాళ్లం కాదు మేం. బతుకచ్చినోళ్లం కాదు మేం. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం అనేది శాశ్వతం కాకపోవచ్చు.. కానీ ధర్మం, న్యాయం శాశ్వతంగా ఉంటుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప.. నాయకులు కాదనే సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కుసంస్కారం ఉన్న, ఎదగలేని, సొంతంగా తిరగలేని నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలి. ధర్మంనుంచి అలాంటి నాయకులు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు.

అమ్ముడుపోని నాయకుడిని భుజాన మోస్తా
నేను గెలవగలిగే సత్తా ఉన్నోడిని.. అమ్ముడుపోకుండా ఉన్నోడిని నా భుజాలమీద మోసే ప్రయత్నం చేస్తా. ఈ బాధ .. ఇదంతా కూడా నానోటి నుంచే కాదు.. ఎన్నడో ఒకనాడు అదంతా తప్పకుండా బయటకొస్తాయ్. ఎవడు పోయి ద్రోహి అయ్యాడో.. ఎవడు హీరో అయ్యాడో అనేది ఆరోజు తెలుస్తదన్న ఆశతో బతికేవాడిని. ఈటల రాజేందర్ వెలిగే దీపమే తప్ప.. తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికేవాడే తప్ప ఈ చిల్లరమల్లర వారితో, వార్తలతో భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నా.”

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సంక్రాంతి స్పెషల్...పవన్ మరో సినిమా అప్డేట్

సంక్రాంతి స్పెషల్…పవన్ మరో సినిమా అప్డేట్

ప్ర‌భాస్- కేజీఎఫ్ య‌ష్ ఫోటోస్- స‌లార్ పూజ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్

ప్ర‌భాస్- కేజీఎఫ్ య‌ష్ ఫోటోస్- స‌లార్ పూజ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్

తొలిరోజు రామ్ రెడ్ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా

తొలిరోజు రామ్ రెడ్ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా

రాధేశ్యామ్ యూనిట్ కు ప్ర‌భాస్ సూప‌ర్ స‌ర్ ప్రైజ్

రాధేశ్యామ్ యూనిట్ కు ప్ర‌భాస్ సూప‌ర్ స‌ర్ ప్రైజ్

అభిజిత్ ను సర్ ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

అభిజిత్ ను సర్ ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

తెలంగాణలో ఎక్కడెక్కడ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారంటే....

తెలంగాణలో ఎక్కడెక్కడ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారంటే….

దేవాల‌యాల దాడుల్లో రాజ‌కీయ నేత‌ల హ‌స్తం

దేవాల‌యాల దాడుల్లో రాజ‌కీయ నేత‌ల హ‌స్తం

జ‌న‌వ‌రి 19న మ‌రోసారి కేంద్రం-రైతు సంఘాల చ‌ర్చ‌లు

జ‌న‌వ‌రి 19న మ‌రోసారి కేంద్రం-రైతు సంఘాల చ‌ర్చ‌లు

జ‌క్రాన్ ప‌ల్లి ఎంపీడీవో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

జ‌క్రాన్ ప‌ల్లి ఎంపీడీవో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

అంబానీ, అదానీల కోస‌మే ఈ చ‌ట్టం- రాహుల్ గాంధీ

అంబానీ, అదానీల కోస‌మే ఈ చ‌ట్టం- రాహుల్ గాంధీ

తీరు మార్చుకోని ఆసీస్- మ‌ళ్లీ జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

తీరు మార్చుకోని ఆసీస్- మ‌ళ్లీ జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)