తెలంగాణలో ఖాళీగా ఉన్న హుజురాబాద్, ఏపీలో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గాలతో పాటు దేశవ్యాప్తంగా 30అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. కరోనా కారణంగా ఎన్నికలు ఆలస్యంగా జరుపుతున్నప్పటికీ… కరోనా ఆంక్షలను పాటించాల్సిందేనని ఈసీ షెడ్యూల్ లోనే ప్రకటించింది.
భారీ సమావేశాలు, సభలను ఈసీ నిషేధించింది. 1000మందికి మించకుండానే సభలు సాగాలని స్పష్టం చేసింది. రోడ్ షోలతో పాటు ర్యాలీలను కూడా ఈసీ పూర్తిగా నిషేధించింది.
ఎన్నికలతోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు గతంలో ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది.