కరోనా పేరుతో అకస్మాత్తుగా ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ రద్దయింది. అయితే, ఆ మ్యాచ్ సిరీస్ నిర్ణేత కావటంతో దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. రెండు జట్ల మధ్య సిరీస్ విజేత ఎవరు అని తేలకపోవటంతో… ఐసీసీ డిస్ప్యూట్ కమిటీకి చేరింది. ఈ మ్యాచ్ వల్ల తమకు 40మిలియన్ ఫౌండ్ల నష్టం వాటిల్లిందని, సరైన పరిష్కారం చూపితే కనీసం ఇన్సూరెన్స్ అయినా క్లైమ్ చేసుకుంటామని ఈసీబీ ఐసీసీని కోరింది.
ఇప్పుడు ఐసీసీ నాలుగు టెస్టుల సిరీస్ గా పరిగణిస్తుందా…. లేదంటే భారత జట్టు మ్యాచ్ కు నిరాకరిస్తే ఈసీబీకి అనుకూలంగా నిర్ణయం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు 2-2తో సిరీస్ సమానం అవుతుంది.