భాగ్యనగరంలో ఈడీ 8 చోట్ల వరుస దాడులు నిర్వహించింది. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి క్యాసినో వ్యవహారంపై ఫోకస్ పట్టింది. విమానంలో పేకాటరాయుళ్లను తీసుకెళ్లి క్యాసినో ఆడించారు వీరు. నేపాల్ జాపాలోని మెచిక్రౌన్ హోటల్ లో ఇదంతా జరిగింది.
సినీ తారలతో ప్రమోషన్స్ చేయించి.. బడాబాబులను ఆకర్షించారు. బాలీవుడ్ నటీమణులతో తాము కూడా క్యాసినోకి వస్తున్నామంటూ ప్రచారం చేయించారు. నటీమణుల ప్రచారంతో ప్రవీణ్ క్యాసినోకి ఫంటర్స్ క్యూ కట్టారు. వివిధ ప్యాకేజీల పేరుతో విదేశాలకు వారిని తీసుకెళ్లారు. 5 రోజులపాటు నిర్వహించే క్యాసినోలో సినీ తారలతో డ్యాన్సులు, విందులు ఏర్పాటు చేశారు.
నెలలో నాలుగు, ఐదు రోజులు క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి విఐపీలు, వివిఐపిలు వస్తున్నట్లు తెలుసుకుంది. ఈ నేపథ్యంలోనే గెలిచిన, ఓడిన ఫంటర్స్ నగదు బదిలీలపై ఈడీ ఆరా తీస్తోంది. భారీగా నగదు ట్రాన్సాక్షన్ జరిగిట్టు అనుమానిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసిన ఈడీ,,, దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహిస్తోంది. ప్రవీణ్ పై గతంలో సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం.