ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ కోర్టు షాకిచ్చింది. హెటేరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రైడెంట్ శరత్ చంద్ర, అరబింద్ ఎండీ నిత్యానందరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యలకు కూడా సమన్లు వచ్చాయి. హెటేరో, అరబిందో ఫార్మాకు భూముల కేటాయింపు కేసులో నాంపల్లి కోర్టు నుండి ఈడీకి కేసులు బదిలీ అయ్యాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులపై రోజువారీ విచారణ సాగుతుంది. అందులో భాగంగా జగన్ అక్రమాస్తుల కేసులోనూ రోజువారీ విచారణ సాగుతుంది. అయితే, అదే రోజు నెల్లూరు జిల్లాలో జగన్ అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది. దీంతో ఇటు ఈడీ కోర్టుకు హాజరవుతారా…? లేదంటే మరోసారి అబ్సెంట్ పిటిషన్ వేసుకుంటారా…? అనేది ఆసక్తికరంగా మారింది.