సంజయ్ కుమార్ మిశ్రా ఈ పేరు చెబితే ఆర్థిక నేరగాళ్లు వణికి పోతారు. ఆర్థిక నేరాల కేసులను చాక చక్యంగా ఢీల్ చేయడంలో ఆయన మంచి దిట్ట. ఆదాయ పన్ను శాఖలో ఎన్నో హై ప్రొఫైల్ కేసులను అత్యంత పకడ్బందీగా విచారించి ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందు దోషులుగా నిలబెట్టిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.
యూపీకి చెందిన సంజయ్ కుమార్ మిశ్రా 1984 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఆయన ఆర్థిక రంగంలో గొప్ప నిపుణుడు. ఆదాయ పన్ను శాఖలో పని చేస్తన్న సమయంలో ఎన్నో హై ప్రొఫైల్ కేసులను టేకప్ చేసి వాటిని సక్సెస్ ఫుల్ గా దర్యాప్తు చేశాడు.
ఎంతో మంది ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాడు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఆయన్ని 2018లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. ఈడీ డైరెక్టర్ గా పదవీ చేపట్టాక ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో విచారణ చేపట్టారు.
వాటిలో కొన్ని కేసుల్లో ఇంకా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన పదవీ కాలం ముగిసింది. ఆయన పనితీరును గుర్తించిన ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఆ పిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఇకపై మిశ్రా పదవీ కాలాన్ని పొడగించరాదంటూ కేంద్రానికి సూచించింది. అదే సమయంలో సంజయ్ ట్రాక్ రికార్డును సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది.
ఆయన్ని ఈడీ డైరెక్టర్ పదవీ నుంచి తొలగించాలంటూ పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించారు. కానీ ఆయనకు ఉన్న ట్రాక్ రికార్డు ముందు అవేవి పని చేయలేదు.
ప్రస్తుతం ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్డ్ వాద్రా, డీకే శివ కుమార్, హేమంత్ సోరేన్, బుపిందర్ సింగ్ హనీ {(పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ అల్లుడు) ఇసుక మైనింగ్ కేసు}, అనీల్ దేశ్ ముఖ్, మనీష్ సిసోడియా (ఢిల్లీ లిక్కర్ స్కాం), కవిత కల్వకుంట్ల (ఢిల్లీ లిక్కర్ స్కాం). టీఎంసీ మాజీ నేత పార్థ చటర్జీ , అర్పిత ముఖర్జీ ఎస్ఎసెస్సీ నియామక కుంభకోణం, ఆప్ నేత సత్యేంద్ర జైన్, మహబూబా ముఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా,
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కేసులు వున్నాయి.