ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థలపై దర్యాప్తు జరపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, భారతీయ రిజర్వు బ్యాంకులను ఆదేశించింది. కాన్ఫడిరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ ఫిర్యాదుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఎఫ్‌డీఐ విధానాన్ని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈడీ, ఆర్బీఐలకు లేఖలు రాసింది.
ఫ్లిప్‌కార్ట్, ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందంలో ఎఫ్‌డీఐ పాలసీ ఉల్లంఘింస్తుదన్న ఆరోపణలుండగా, అమెజాన్ ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంది. చట్టాల్లోని లొసుగుల ఆధారంగా ఈ కంపెనీలు భారీ కుంభకోణంకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.