బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. సుశాంత్ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయలు మాయం అయ్యాయని ఆయన తండ్రి చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ.. వేగంగా దర్యాప్తు చేస్తోంది.
సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తి, మాజీ మేనేజర్ శృతి మోదీని ఈడీ ఇవాళ విచారణకు పిలిచింది. అయితే సుప్రీంలో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నందున.., తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడాన్ని వాయిదా వేయాలని రియా కోరోగా.. ఈడీ తిరస్కరించింది. దీంతో రియా చక్రవర్తి చివరకు ముంబైలోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు
మరోవైపు రేపటి విచారణకు హాజరు కావాలంటూ సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానికి కూడా ఈడీ నోటీసులు పంపింది.