బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గురువారం ఢిల్లీకి రావాలని కోరుతూ ఆమెకు సమన్లు పంపింది. తాను కవిత బినామీనని ఈ కేసులో నిందితుడు, బిజినెస్ మన్ అరుణ్ రామచంద్రన్ పిళ్ళై అంగీకరించారని ఈడీ తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
. ఇందులోనే కవిత పేరును కూడా చేర్చిన విషయం గమనార్హం. మహిళా రిజర్వేషన్లపై ఈ నెల 10 న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని కవిత ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో.. ఈడీ ..ఆమెకు నోటీసులు పంపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు లిక్కర్ కేసులో 11 మందిఅరెస్టయ్యారు.
తనకు ఈడీ తాజాగా జారీ చేసిన నోటీసులపై కవిత స్పందన ఇంకా తెలియలేదు. పిళ్ళైతో కలిపి ఆమెను ఈడీ అధికారులు విచారిస్తారని తెలుస్తోంది.