ఢిల్లీలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సంత్యేంద్ర జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోమవారం దాడులు చేశారు.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జైన్ నివాసంలో సోమవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఆయన్ని గత నెల 30న ఈడీ అరెస్టు చేసింది.
కోల్ కతా కేంద్రంగా నడిచే ఓ కంపెనీకి అక్రమంగా డబ్బులన జైన్ ట్రాన్స్ ఫర్ చేసినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనకు సంబంధించిన రూ.4.81కోట్ల విలువైన స్థిరాస్థులను ఈడీ జప్తు చేసింది.
దర్యాప్తు సమయంలో సరైన వివరాలు అందించలేదన్న కారణంగా ఆయనపై ఈడీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మే 30న ఆయన అరెస్టు కాగా జూన్ 9 వరకు ఆయన్ని ఈడీ కస్టడీకి కోర్టు ఇచ్చింది.