ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో దర్యాప్తును ఈడీ మరింత వేగవంతం చేసింది. తాజాగా సీబీఐ కోర్టులో ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో పలు కీలక అంశాలను ఈడీ పొందుపరిచినట్టు ఈడీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ1 నిందితుడు మనీష్ సిసోడియా పేరు మొదటి జాబితాలో ఈడీ చేర్చలేదు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌లో చేర్చే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈడీ తొలి ఛార్జిషీట్‌లో సమీర్ మహేంద్రు పేరును ఈడీ చేర్చింది. సమీర్‌కు చెందిన నాలుగు కంపెనీల పేర్లను ఛార్జిషీట్‌లో ఈడీ ప్రస్తావించింది. మొదటి ఛార్జ్ షీట్లో టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈఢీ 28 సార్లు ప్రస్తావించింది.
గతంలో మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ గురించి ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఇప్పటి వరకు ఈ స్కాంలో సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్ చేసింది.