ప్రముఖ ప్రైవేటు బ్యాంకు ఎస్ బ్యాంకు దివాలా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ బ్యాంకుపై కేంద్రం మారిటోరియం విధించగా… నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరు వరకు ఖాతాదారులకు రోజుకు కేవలం 50వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది.
ఈ కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభించిన ఈడీ… బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్, తదితరులపై మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న ఎస్ బ్యాంకు నుండి అనిల్ అంబానీ 12,800కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీనిపై స్పందించిన అంబానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హజరుకాలేనని, హజరు తేదీని మార్చలంటూ ఈడీని కోరినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మరికొందరు ప్రముఖ కార్పోరేట్ కంపెనీల అధినేతలకు కూడా నోటీసులు అందినట్లు తెలుస్తోంది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, వొడాఫోన్ ఉన్నట్లు ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ ప్రకటన చేసింది.