బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యలో రేఖ చక్రవర్తిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. సుశాంత్ అకౌంట్ నుండి దాదాపు 15కోట్లు ఒక్క ఏడాదిన్నరలోనే రియా మళ్లించినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించటంతో ఈడీ ఎంటరైంది. శుక్రవారం దాదాపు 8గంటల పాటు రియాను ఈడీ ప్రశ్నించింది.
అయితే… శుక్రవారం నాటి విచారణలో ఈడీకి రియా ఏమాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. గత మూడు సంవత్సరాల్లో రియా ఖర్చులు, ఆస్తుల కొనుగోలు అంశాలపై ఈడీ ప్రశ్నలకు రియా సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం మరోసారి విచారణకు హజరుకావాలని ఈడీ రియాను ఆదేశించింది.
మంగళవారం సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చే వరకు ఈడీ విచారణను నిలుపుదల చేయాలని శుక్రవారం విచారణకు ముందే రియా చేసుకున్న రిక్వెస్ట్ ను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిరాకరించారు.