శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను పోలీసులు ఈ రోజు కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
మనీలాండరింగ్ కేసులో ఆదివారం ఆయన్ని ఈడీ అధికారులు సుమారు 10 గంటల పాటు విచారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో రాష్ట్రంలో పలు చోట్ల శివసేన కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రౌత్ అరెస్టుపై అటు పార్లమెంట్ లోనూ విపక్షాల సభ్యులు నిరసనలకు దిగారు.
ఈడీ విచారణకు హాజరు కావాలంటూ ఇటీవల రెండు సార్లు రౌత్ కు ఈడీ నోటీసులు పంపింది. కానీ విచారణకు రౌత్ హాజరు కాలేదు. దీంతో ఆదివారం రౌత్ నివాసంలో ఈడీ దాడులు చేసింది. కేసు విచారణ కోసం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.