పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హిట్టా… ఫ్లాపా అనేది సంబంధం లేదు ఫ్యాన్స్ చేసే రచ్చ వేరేలా ఉంటుంది. అయితే పవన్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ కన్నా ఫ్లాప్ సినిమాలు ఎక్కువ. మరికొన్ని యావరేజ్ టాక్ ని తెచ్చుకున్నాయి. అయితే యావరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా బ్లాక్ బస్టర్ స్థాయిలో వసూలు సాధించాయి కొన్ని సినిమాలు.
ఇక పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం తొలిప్రేమ. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అప్పట్లో అవార్డును గెలుచుకుంది ఈ చిత్రం. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే దేవా ఇచ్చిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ గా నిలిచింది.
కాగా తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. పవన్ పక్క హీరోల సినిమాల గురించి పట్టించుకోరని తన పని పై మాత్రమే ఫోకస్పెడతారని చెప్పుకొచ్చారు. అలాగే తొలిప్రేమ సినిమా కు నాకు నంది అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు.
Advertisements
అయితే మొదట ప్రివ్యూ సినిమా చూసి బాగుందని టీం సభ్యులు అనుకుంటే… బయ్యర్లు మాత్రం సినిమా చూస్తున్నప్పుడు నిద్ర పోయారని చెప్పుకొచ్చారు. అయితే ఓ బయ్యర్ డైరెక్టర్ ను పిలిచి సాంగ్స్ లో ఒక్క ఫిమేల్ వాయిస్ కూడా లేదు. మీకు ఆడవాళ్లంటే ఇష్టం లేదా అని అడిగారని అన్నారు వెంకటేష్. కట్ చేస్తే తొలిప్రేమ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిందన్నారు.