కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా పోలీసుల క్రూరత్వాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. విధుల్లో ఉన్న జర్నలిస్టులపై భౌతిక హింసకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛ గొంతు నొక్కడమేనని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. నిరసనలను కవర్ చేసే జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఎడిటర్స్ గిల్డ్ కోరింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీల్లో పోలీసులు జర్నలిస్టులను టార్గెట్ చేశారు. ఐడీ, అక్రిడేషన్ కార్డులు చూపించినప్పటికీ వారిపై దురుసుగా ప్రవర్తించారు. న్యూస్ కవర్ చేయకుండా అడ్డుకున్నారు. యూపీలో ఓ రిపోర్టర్ ను చాలా సేపు నిర్బంధించి వదలిపెట్టారు.