కరోనా వైరస్ వల్ల చదువులు సరిగ్గా సాగని నేపథ్యంలో… విద్యాశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో పలువురు టీచర్లతో లైవ్ చాట్ లో మాట్లాడిన మంత్రి రమేష్ పోక్రియల్ సీబీఎస్ఈ పరీక్షల తేదీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 ఫిబ్రవరి చివరి వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. సీబీఎస్ఈ పరీక్షల తేదీలను ప్రతి సంవత్సరం నవంబర్ లోనే ప్రకటిస్తారు. కానీ ఈసారి అలా ప్రకటన చేయకపోవటంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు ఓపెన్ చేయని కారణంగా 10-12వ తరగతి విద్యార్థుల సెలబస్ ను 30శాతం తగ్గించామన్నారు. అయితే ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని… మొత్తంగా 50శాతం తగ్గిస్తున్నట్లు తెలిపారు.
అయితే, ఆన్ లైన్ లో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆన్ లైన్ పరీక్షలు సాధ్యం అయ్యే పని కాదని…. 24000 సీబీఎస్ఈ పాఠశాలల్లో చాలా వరకు గిరిజన, రిమోట్ ఏరియాల్లో స్కూల్స్ ఉన్నాయని, అక్కడ చదువుకుంటున్న వారు లాప్ టాప్ కొని ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని పరీక్షలు రాయటం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.