తెలంగాణలో నిన్నటి వరకూ బోసిపోయిన స్కూ్‌ళ్లు, కాలేజీలు, బస్ స్టాప్ లు కళను తిరిగి సంతరించుకున్నాయి. 24 రోజుల సెలవుల తరువాత ఈ రోజు నుంచి విద్యా సంస్థలు తెరచుకున్నాయి. స్కూల్స్ ప్రారంభమైనప్పటికీ కోవిడ్ నిబంధనలు మాత్రం కఠినంగా అధికారులు అమలు చేస్తున్నారు.
విద్యాసంస్థల్లో శానిటైజర్లు, మాస్క్‌లతో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరగడంతో జనవరి 8 నుంచి జనవరి 16 వరకు విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో సెలవులను జనవరి 31 వరకు పొడిగించారు.
కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 1 నుంచి విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సుమారు 26 వేల పాఠశాలలు ఉండగా, వాటిలో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
అయితే.. హైదరాబాద్ లో కొన్ని విద్యాసంస్థల పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. కొన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలు ఈనెల 2 నుంచి ప్రారంభిస్తున్నాయి. మరికొన్ని మాత్రం కరోనా దృష్టిలో ఉంచుకోని కొద్ది రోజులపాటు ఆన్‌లైన్ తరగతులు జరపాలని నిర్ణయించాయి.