కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి స్కూల్స్ , కాలేజ్ లు, కోచింగ్ సెంటర్లతో సహా యూనివర్సిటీ లు మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రోజు రోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండటంతో ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలు పై ముఖ్య మంత్రి జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటికి పొరుగు రాష్ట్రాల్లో మాత్రం కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలకు, కాలేజ్ లకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.