అఖిల్ అక్కినేని తాను చేస్తోన్న సినిమాల మధ్య గ్యాప్ తీసుకుంటున్నాడు. ప్రతి సారి ఆయన కొంత నిడివి తీసుకున్నప్పటికీ సినిమా మాత్రం నిరుత్సాహాన్నే మిగులుస్తుంది. కుర్ర హీరోలలో తనంటే ఏమిటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. ప్లాప్ ఎదురు అవుతుండటం ఆయన స్పీడ్ కు బ్రేకులు పడుతున్నాయి. అందుకే వస్తోన్న ప్రతి సినిమాలో అన్ని ఆలోచించి నటిస్తోన్న ఏది కలిసి రావడంలేదు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
లవ్ అండ్ ఫ్యామిలీ నేపథ్యమున్న సినిమాలను తెరకెక్కించడంలో భాస్కర్ కు మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయన డైరక్షన్ లో వస్తోన్న ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుండగా.. మరో కథానాయికగా ఈషా రెబ్బా నటించనున్నారని తెలుస్తోంది. ఆమెతో ఆల్రెడీ కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేసినట్లు చెబుతున్నారు. అఖిల్ లాగే ఈషా రెబ్బా కూడా మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ సినిమాతో ఇద్దరి ముచ్చట తీరుతుందని అంటున్నారు. పూజా హెగ్డే – ఈషా రెబ్బా ఇదివరకు ‘అరవింద సమేత’లో కలిసి నటించారు. మరోసారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.