తెలుగమ్మాయిలకి సినిమాల్లో అవకాశాలు రావు అనే మాటని చెరిపేస్తూ వరంగల్ పిల్ల ఈషా రెబ్బ, చిన్న పెద్ద తేడా లేకుండా నచ్చిన సినిమా చేసుకుంటూ పోతుంది. గతేడాది ఎన్టీఆర్ పక్కన అరవింద సమేతలో కలిసి నటించిన ఈషా, లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్ లో నటించడానికి రెడీ అయ్యింది. ఇప్పటివరకూ తనకున్న హోమ్లీ ఇమేజ్ ని పోగొట్టుకోవడానికే ఈషా హాట్ ఫోటోషూట్ చేసింది అనే మాట వినిపిస్తోంది. ఈ ఫోటోషూట్ నుంచి బయటకి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూసి, ఈమెనే ఇన్ని రోజులు మన చూసిన ఈషా అని షాక్ అవుతున్నారు.
దీనిదేముంది మీకు అంతకన్నా పెద్ద షాక్ ఇస్తానని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిన ఈషా, చిరు 152 సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించినా కూడా చివరికి ఆ అవకాశం ఈషారెబ్బనే వరించింది. ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా కూడా చిరు కోసం కొరటాల రాసిన కథలో ఇద్దరు హీరోయిన్ల రిక్వైర్మెంట్ ఉండడంతో ముందుగా ఈషాని ఫైనల్ చేశారని సమాచారం. మరి ఈ మూవీ అయినా ఈషా రెబ్బ కెరీర్ కి స్టార్ స్టేటస్ అందిస్తుందేమో చూడాలి.