ఈజిప్ట్ పిరమిడ్ల ముందు సల్మా అల్ షిమి అనే మోడల్ అర్థనగ్నంగా ఫోటోషూట్ చేయడంతో …సమాచారం తెల్సుకున్న పోలీసులు సల్మాను ఆమెతో పాటు ఫోటో గ్రాఫర్ ను అరెస్ట్ చేశారు. ఈజిప్ట్ చట్టాల ప్రకారం పురాతాన కట్టడాల వద్ద అశ్లీలంగా ఫోటోలు దిగడం నేరం. ఆ రూల్ ప్రకారమే ఇద్దర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈజిప్ట్ లోని 4700 సంవత్సరాల పూర్వపు పిరమిడ్స్ వద్ద ఈ ఫోటో షూట్ జరిగింది. స్థానికులు సైతం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరూ బెయిల్ పై విడుదలయ్యారు.