ఏక్ మినీ కథ, ఈ మాయ పేరేమిటో హీరోయిన్ కావ్యా థాపర్ చిక్కుల్లో పడింది. మద్యం మత్తులో ఆగి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. అలాగే ఓ మహిళా పోలీసు అధికారిపై దాడికి పాల్పడింది.
దీనితో ఆమెను గురువారం జుహు పోలీసులు అరెస్టు చేశారు. మొదట వాహనాన్ని గుద్దిన తరువాత ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసు అధికారి యూనిఫాం కాలర్ పట్టుకుంది.
ఆ తరువాత స్నేహితురాలితో కలిసి పార్టీ నుంచి తిరిగి వస్తున్న కావ్యా థాపర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం (సెక్షన్ 279), ఒక ప్రభుత్వ అధికారిని తన విధులను నిర్వర్తించనీయకుండా దాడి చేయడం (సెక్షన్ 353), ఉద్దేశపూర్వకంగా అవమానించడం (సెక్షన్ 504),పై పోలీసులు కావ్యా థాపర్ పై కేసు నమోదు చేశారు.