మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏక్ నాథ్ షిండే తన ట్విట్టర్ డీపీని మార్చారు. శివసేన మాజీ చీఫ్ బాల్ ఠాక్రేతో ఆయన కలిసి వున్న ఫోటోను డీపీగా పెట్టుకున్నారు.
ఈ డీపీ ద్వారా మాజీ ముఖ్యమంత్రికి ఉద్దవ్ ఠాక్రేకు, ఆయన అనుచరులకు, మహారాష్ట్ర ప్రజలకు షిండే స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. బాల్ ఠాక్రే ఫోటోను పెట్టడం ద్వారా బాల్ ఠాక్రేకు అసలైన రాజకీయ వారసున్ని తానే నంటూ పరోక్షంగా సందేశం ఇచ్చారు.
రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి సూరత్ కు వెళ్లినప్పటి నుంచి ఉద్దవ్ పై షిండే తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్, ఎన్పీలకు వ్యతిరేకంగా బాల్ ఠాక్రే ఫైట్ చేశారని షిండే అన్నారు. కానీ ఉద్దవ్ మాత్రం ఆ పార్టీలతో చేతులు కలిపారని తెలిపారు. బాల్ ఠాక్రే ఆశయాల, సిద్దాంతాల, హిందుత్వ విషయంలో ఉద్దవ్ ఠాక్రే రాజీ పడ్డారని షిండే ఫైర్ అయ్యారు.