కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో మాగడి ప్రాంతంలో ఓ వ్యక్తి తన బైక్‌తో వృద్దున్ని నడి రోడ్డుపై కిలో మీటర్ దూరం ఈడ్బుకు వెళ్లాడు. అదే రహదారిపై వెళుతున్న కొందరు దాన్ని వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల వివరాల ప్రకారం…
ముత్తప్ప అనే డ్రైవర్ కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో సహీల్ అనే వ్యక్తి బైక్ పై వచ్చి సుమోను ఢీ కొట్టాడు. దీంతో సుమో డ్యామెజీ అయింది. వాహనం దిగి ముత్తప్ప సహీల్‌తో గొడవ పడ్డాడు. సుమో మరమ్మతులకు అయ్యే ఖర్చులు భరించాలని సహీల్‌ను ముత్తప్ప డిమాండ్ చేశాడు.
వాగ్వాదం జరుగుతుండగానే బైక్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు సహీల్ ప్రయత్నించాడు. స్కూటీని స్టార్ట్ చేసి ముందుకు వెళ్లేందుకు సహీల్ ప్రయత్నించాడు. దీంతో సహీల్ ముందుకు వెళ్లకుండే అడ్డుకునేందుకు గాను ఆ స్కూటీని ముత్తప్ప వెనక నుంచి పట్టుకున్నాడు.
అయినప్పటికీ సహీల్ తన స్కూటీని అతాగే ముందుకు పోనిచ్చాడు. ముత్తప్పను కిలో మీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. రోడ్డుపై వెళుతున్న కొందరు తమ బైక్‌లతో సహీల్ ను ఓవర్ టేక్ చేసి పట్టుకున్నారు. వెంటనే అతనికి దేహశుద్ది చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సలీల్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.