తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకో వారం రోజులలో రానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలతో పాటు..ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది…అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారికి గతంలో ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయనిచ్చే వారు..ఇప్పుడు మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు అంటుంది ఎన్నికల కమిషన్..
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి కావలసిన కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్…అయితే ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్ల పై అధికారుల కు ఇప్పటికే సూచనలు చేసింది… గత ఎన్నికల వరకు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసే వారు…కానీ కొత్త గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్టం లో ముగ్గురు పిల్లలు ఉన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయవొచ్చు అని సూచనలు చేశారని తెలుస్తుంది..
మరి కొద్దీ రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వనున్నా నేపధ్యంలో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఇప్పటికే పలు మార్లు కలెక్టర్ లు,మున్సిపల్ కమిషనర్ లతో వీడియో కాన్ఫిరెన్సు ద్వారా సూచనలు చేశారు..
నవంబర్ మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది..ట్రైనింగ్ అయి ట్రాన్స్ఫార్ ,అయినా ఉద్యోగుల తో పాటు ,చనిపోయిన ఉద్యోగుల స్థానంలో కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు..ఈ 31 న హైకోర్టు తీర్పు అనంతరం ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణ జరిపేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్స్ ని ఆదేశించారు..
రాష్ట్రంలో ఉన్నా 128 మున్సిపాలిటీ లలో 12 మున్సిపాలిటీ లకు ,9 కార్పోరేషన్ లకు ఎన్నికలు నిర్వహించనున్నారు…మిగితా 8 మున్సిపాలిటీ లకు తరువాత ఎన్నికలు జరుగనున్నవి…
రాష్ట్రంలో గత ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నా వారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేక చాలా మంది పోటీ చేయలేక పోయే వారు..ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కొత్త చట్టం తీసుకురావడం తో ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చు అని తెలిపింది ఎన్నికల కమిషన్…