ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చీఫ్ ఎన్నికల కమిషనర్ ఇతర ఉన్నతాధికారుల గురువారం సమావేశమవుతున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22 లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసే కార్యక్రమాలు ప్రారంభించారు.
మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఈ సారి జెండా ఎగురవేయాలని అన్ని పార్టీలు తహతహలాడుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి రాబోయే ఎన్నికలు పరీక్ష కానున్నాయి. 2015 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ పెద్దగా సాధించింది ఏమీ లేదు. బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విన్నింగ్ ఫార్ములాపైనే ఆధారపడి ఉంది. ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది.