రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల హీట్ మొదలవనుంది. ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న మనస్పర్థల కారణంగా వినిపిస్తున్న హుజూర్ నగర్ బై ఎలెక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 23న నోటీఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 24న ఫలితాలు ప్రకటించబోతున్నారు.
2018 ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి గెలిచిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా కూడా గెలవడం తో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వదులుకున్నారు. దింతో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలతో కలిపి హుజుర్ నగర్ కు కూడా ఎన్నికలు ఉండబోతున్నాయి.
అయితే…. కాంగ్రెస్ నుండి ఎవరు పోటీలో ఉంటారు అనే అంశంలో ఇప్పటికే భిన్న వాదనలున్నాయి. ఉత్తమ్ ఇప్పటికే తన భార్య పోటీలో ఉంటుందని ప్రకటించగా, వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి పేరును ప్రకటించారు. అయితే… దీనిపై ఏఐసీసీ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక టీఆరెస్ నుండి గతంలో పోటీచేసిన సైదిరెడ్డి, అంతకు ముందు పోటీచేసిన తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీపడుతుండగా…. సైదిరెడ్డి వైపే ఆ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మొగ్గుచూపిస్తున్నారు. అయితే…. సోషల్ మీడియాలో మాత్రం కేసీఆర్ కూతురు కవిత పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇక టిడిపి నుండి నర్సిరెడ్డి పేరు వినపడుతోంది.