ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వార్ మరింత ముదిరింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ వేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషన్ ప్రకటన ఇచ్చిందని, ఎన్నికల కమిషన్ చర్యలు సుప్రీం కోర్ట్ సూచనలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కరోనా తో దాదాపు 7వేల మంది మరణించారని కోర్ట్ కు తెలిపింది. ఈ దశలో ఎన్నికలు సాధ్యం కాదని సర్కార్ కౌంటర్ దాఖలు చేసింది.
ఎన్నికల కమిషన్ మాత్రం ప్రభుత్వం ను సంప్రదించామని, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వాదిస్తోంది.