ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకుండానే ఎన్నికల తేదీలు ఖరారు చేశారంటూ… టీడీపీ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఏకీభవించి స్టే ఇచ్చింది. సరిగ్గా పోలింగ్ కు ఒక్కరోజు ముందు స్టే రావటంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందేహం ఇటు ఎన్నికల అధికారులు, పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఓటర్లలో నెలకొంది.
అయితే, స్టే పై అప్పీల్ కు వెళ్లాలని ఎస్ఈసీ నిర్ణయించటంతో… ఎన్నికల ఏర్పాట్లను యాధావిధిగా కొనసాగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని ఎస్ఈసీ నీలం సాహ్ని నుండి జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఎస్ఈసీ ఇప్పటికే డివిజన్ బెంచ్ లో హౌజ్ మోషన్ పిటిషన్ వేయగా… మద్యాహ్నాం దీనిపై వాదనలు జరగనున్నాయి.
దీంతో ఎన్నికలుంటాయా… లేదా అన్న సందేహంతో అందరి దృష్టి హైకోర్టు పైనే ఉంది.