ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తో కీలక భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలుగా జగన్ తో సమావేశం కొనసాగింది.
ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు తిరుపతి ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు… ప్రతిపక్ష నేతల ఆలయ పరిరక్షణ యాత్రలు చేపట్టడంపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల వరకు వైసీపీతో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీం… వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు రావటంలో కీలకపాత్ర పోషించింది.
ఆలయాలపై దాడులు… బైబిల్ పార్టీ ముద్రపడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు జగన్ ప్రశాంత్ కిషోర్ సహాయం కోరినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.