మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, ఇందారం గ్రామంలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్‌కు ఎన్నికలతోనే పని అని, అవి
ఉంటేనే ఆయన ఫాం హౌస్ నుంచి బయటకు వస్తారని ఎద్దేవా చేశారు.
గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడని విమర్శించారు. ఓట్లు వేయించుకొని దొర, అలాగే ఫామ్ హస్‌కి వెళ్లిపోతాడన్నారు. మళ్లీ తిరిగి ప్రజలవైపు చూడరని, ‘యేరు దాటే వరకు ఓడ మల్లన్న… యేరు దాటినాక బోడి మల్లన్న’ లా కేసీఆర్ బోడి లెక్క ఉంటుందని మండిపడ్డారు.
అందుకే ఈసారి కేసీఆర్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలని, వైఎస్‌ఆర్ సంక్షేమం కోసమే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఉందని, వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే ప్రజా సంక్షేమానికి కట్టుబడి పాలన చేస్తామని షర్మిల ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.