తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేందుకు జరిగిన ప్రయత్నాలు, బ్యాటరీ బస్సుల పేరుతో ఆర్టీసీలోకి అడుగుపెట్టిన బడా పారిశ్రామికవెత్తల బాగోతాలు అన్నీ బయటపడ్డాయి. దాంతో కొందరు కోర్టులను ఆశ్రయించటంతో ఆ వ్యవహారం అలా ఆగిపోయింది. దాంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులను పక్కన పెట్టి… ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకరాబోతున్నారని, 6 వేల కోట్ల ప్రజాధనం కరిగిపోనుందని ఆదాబ్ హైదరాబాద్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం యధావిధిగా తొలివెలుగు.కామ్‌లో….
◆ 6 వేల కోట్ల వ్యవహారం
◆ ఆ ఇద్దరి కోసమే..!
◆ చైనా ‘బివైడి’తో చెట్టాపట్టాల్
◆ తెలుగు అధిపతుల అంగీకారం..?
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
తెలంగాణలో రూ.5,200 కోట్ల విలువైన ‘బ్యాటరీ బస్’ల వ్యవహారం కోర్టు జోక్యంతో ఆగిపోయింది. మరి ఇప్పుడు ఆ స్థానంలో మరో ప్రణాళిక నిశ్శబ్దంగా సిద్దమైందని తెలుస్తోంది. ఇద్దరు పారిశ్రామిక వేత్తల కోసం మరో ఇద్దరు రాష్ట్ర పెద్దలు అంగీకరించినట్లు ఆయా వర్గాల నుంచి సమాచారం. సుమారు రూ6వేల కోట్ల రూపాయల విలువైన ‘చైనాకు చెందిన బివైడి’ సంస్థకు చెందిన ‘బ్యాటరీ ఆటోలు’ తెలుగు రాష్ట్రాల్లో తిరగనున్నాయి. ఈ ఆటో వ్యవహారంలో అసలు కథ ఏమిటి..? ‘ఆదాబ్ హైదరాబాద్’ అందిస్తున్న పరిశోధన కథనం.
ముందు మూడు.. ఇప్పుడు ఆ ‘ఒక్కటే’…:
లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ప్లాంట్లు తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు గతంలో మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. హైదరాబాద్ లోని శంషాబాద్ వద్ద రానున్న ఈ కేంద్రాల్లో తొలి దశలో రూ.1,500 కోట్ల పెట్టుబడి. ఒక గిగావాట్‌తో ప్రారంభమై మూడు దశల్లో 10 గిగావాట్ సామర్థ్యానికి చేరుకుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ విభాగం అధికారులు చెప్పారు. ఈ మూడు సంస్థల ద్వారా రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని వారు వెల్లడించారు. 9-15 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాలి. అయితే ఆర్థిక పెద్దలు రంగప్రవేశం చేశారు. ఆ పాత మూడం కంపెనీలను మూటకట్టి మూలనేశారు. కొత్త కంపెనీ తెరపైకి వచ్చింది. పాత సంగీత్ థియేటర్ వద్ద ట్రైల్ జరుగనున్నట్లు తెలుస్తోంది.
వీరి కోసమేనా..:
‘మెగా’ కంపెనీ, గోల్డ్ స్టోన్ ‘ప్రసాద్’ లీజు.. సబ్ లీజులతో రెడీ అయిపోయాయి. చైనాలోని బివైడి ఆటో సంస్థ రూపొందించిన
ఈ ఆటో వ్యవహారంలో బాగానే ఆర్థిక లావాదేవీలు ఆశగా ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల పెద్దలు కూడా ఈ ‘బ్యాటరీ’లకు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.
పైకి ఇలా..:
నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, దీనిని తగ్గించడంలో భాగంగా కాలం చెల్లిన పాత త్రీవీలర్ల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో రీప్లేస్ చేయాలని భావిస్తున్నట్టు వారు చెపుతున్నారు. బ్యాటరీల తయారీలో వాడే లిథియం నిక్షేపాలున్న బొలీవియాలో మైనింగ్ కోసం భారత కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే తమ దేశంతో చర్చలు జరుపుతున్నాయని భారత్‌లో బొలీవియా రాయబారి ‘న్యూఢిల్లీ ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి’కి జె.జె.కార్టెజ్ తెలిపారు. చైనాకు చెందిన బివైడి ఆటో సంస్థ రూపొందించిన విద్యుత్ బ్యాటరీలు ఎక్కడ, చార్జింగ్ పాయింట్లు, భారతీయ రోడ్లకు అనుకూలంగా ఉంటాయా..? లేదా..? అనే విషయాలపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలిసింది.
లోగుట్టు ఏమిటి..?
తెలంగాణలో రూ.5,200 కోట్ల విలువైన ‘బ్యాటరీ బస్’ల వ్యవహారం హైకోర్టు జోక్యంతో తాత్కాలికంగా ఆగిపోయింది. ఇప్పుడు ఆ స్థానంలో మరో ప్రణాళిక నిశ్శబ్దంగా సిద్దమైందని తెలుస్తోంది. ఇద్దరు పారిశ్రామిక వేత్తల కోసం మరో ఇద్దరు రాష్ట్ర పెద్దలు అంగీకరించినట్లు ఆ, యా వర్గాల నుంచి సమాచారం. అయితే ఓ డీల్ పోవడంతో మరో డీల్ సిద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న ఆటోల స్థానంలో బ్యాటరీ ఆటోలు రానున్నాయి. ఈ కొత్త ఆటోలను పాత ఆటోలు నడిపే వారికి లోనుపై ఏర్పాటు చేస్తారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద రవాణా వ్యవస్థ ప్రైవేటు పరం కానున్నది. ప్రైవేట్ పరం అంటే… ‘ఎవరికి ఎంత లాభం’ ఎలా..? ఎంత లెక్కలు వేసుకోవడమే.. ఎంతైనా.. మన మెఘా కృష్ణారెడ్డి, మన గోల్డ్ స్టోన్ ప్రసాద్ లకు ఈ కాంట్రాక్టు దక్కితే… వారి కోట్ల ఆస్తి మరికొంత పెరుగుతుంది. ‘లక్ష్మీకటాక్ష ప్రాప్తి రస్తు’. అనంతరం ఈడీ కేసులు ‘ఆవాహయామి’.