భారత్ జోడో యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రాహుల్ రాక సందర్భంగా పార్టీ జెండాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో కరెంట్ షాక్ కొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాహుల్ గాంధీ పరామర్శించి పరిహారం ప్రకటించారు.
యాత్ర సందర్భంగా ఓ స్తంభానికి పార్టీ జెండాను కడుతున్నారు. ఆ సమయంలో ప్రమాదవ శాత్తు జెండా విద్యుత్ లైన్ కు తాకింది. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టింది. ఈ ఘటనలో మోకా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రామన్నతోపాటు మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
దీంతో క్షతగాత్రులను వారందరినీ మోకా ఆస్పత్రికి తరలించారు. రాహుల్ గాంధీ యాత్రకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వెంట ఉన్న భద్రతా బృందం ఆయనకు రక్షణ కల్పించింది.
భారత్ జోడో యాత్ర వేయి కిలో మీటర్లు మైలు రాయిని అధిగమించింది. ప్రస్తుతం బళ్లారి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతోంది. బళ్లారిలో మహాసమ్మేళనాన్ని ఏర్పాటు చేయగా భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు.