మనుషులకే కాదు పశుపక్షాదులు కూడా గొడవలు పడుతూ ఉంటాయి. పొట్టేళ్ళు, కోడిపుంజులు కొట్టుకోవడం సహజం. అవి గొడవలు పడుతుంటే మనుషులు కళ్ళజోళ్ళు పెట్టుకుని టెంటులు వేసుకుని మరీ చూస్తుంటారు.వాటి రక్తమాంసాలు మనుషులకు ఆనందం.
మరలా ఏనుగులు కొట్టుకుంటుంటే వినోదంగా చూడగలరా, వెంటనే ఆ ప్లేస్ ఖాళీచేసి వాటికిచ్చేయ్యాల్సిందే…! తిక్కరేగితే కంట్రోల్ చేస్తున్న మావటివాణ్ణి కూడా తొండంతో నేలకేసిబాది తుంగలోకి తొక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా అలాంటి సంఘటనే కేరళలోని పాలక్కాడ్ జిల్లా తూర్పు అంజేరి ప్రాంతంలో జరిగింది. ఏనుగులు చితక్కొట్టుకున్నాయ్. అవి కొట్టుకోవడమే కాదు, చుట్టుపక్కల షాపుల్ని,మనుషుల్ని,బైకుల్ని, కార్లని తొక్కినారతీసాయి.
కింజక్కరి తిరువారు శివాలయంలో నిరమలలో జరిగే ఉత్సవాల కోసం మూడు ఏనుగులను నిర్వాహకులు తీసుకొచ్చారు. ఆలయ సమీపంలోకి రాగానే ఏనుగు ఉరుకులు పరుగులుపెట్టి మిగతా రెండింటిపై దాడి చేయడం ప్రారంభించింది.
ఏనుగు ఉరుకులు పరుగులు పెట్టి మిగతా రెండింటిపై దాడి చేయడం ప్రారంభించింది. ఏనుగుల ఘర్షణలో ఆరుబైకులు,పలు కార్లు ధ్వంసం అయ్యాయి.ఆలయ సమీపంలోని షాపులను తలోదిక్కు తీసుకెళ్ళడంతో వీటి మధ్య ఘర్షణ తగ్గింది. ఈ ఘటనలో గిరీష్ కట్టుస్సేరి (35) అనే వ్యక్తి గాయపడ్డాడు. అదుపు చేసేందుకు మావటీలకు దాదాపుగా గంటల సమయం పట్టింది.