జూన్ 2020 లో కేరళలోని మలప్పురంలో…..గర్భంతో ఉన్న ఏనుగుకు పేలుడు పదార్థాలు తినిపించి దాని మరణానికి కారణమైనారు. మళ్లీ ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి ఘటనే జరిగింది.తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఓ వ్యక్తి ఏనుగు పైకి మండుతున్న టైర్ ను విసిరి దాని మరణానికి కారణమయ్యాడు!
అసలేం జరిగింది?
నీలగిరి జిల్లాలోని మసినగురిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్ వైపు వస్తున్న ఓ ఏనుగును తరిమికొట్టడానికి రిసార్ట్ సిబ్బంది ప్రయత్నించారు. మంటతో బయపెట్టాలని చూసిన ఓ వ్యక్తి టైర్ ను కాలబెట్టి ఏనుగుపైకి విసిరాడు…అది కాస్త ఏనుగు చెవులో చిక్కుకుపోయింది. ఇంకా ఆ మంట భయానికి ఏనుగు పరుగులు పెట్టడంతో మంట మరింతగా వ్యాపించి శరీరమంతా కాలిపోయింది.
వెంటనే అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఏనుగును చేరదీసి ట్రీట్మెంట్ అందించారు. అయినప్పటికీ వారం రోజుల తర్వాత ఏనుగు చనిపోయింది. ఈ కేసులో పోలీసులు వీడియో ఆధారంగా ప్రసాద్, రేమండ్ డీన్ అనే ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఇద్దరితో పాటు, రికీ ర్యాన్ అనే మరో వ్యక్తి కూడా ఈ సంఘటనలో పాల్గొన్నట్టు గుర్తించారు.
Soldier Crying after Elephant Death:
Barbaric act in Nilgiris, Tamilnadu. An elephant was attacked with a burning tyre, in a private resort, killing the animal. Hope the guilty are punished for this inhumane act of violence. #WA #EveryLifeMatters #SaveWildlife pic.twitter.com/iLJn2yxgdq
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) January 22, 2021