వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగా, అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. చాలా చోట్ల అడవుల గుండా పెద్ద పెద్ద జాతీయ రహదారులు నిర్మించారు. అడవుల్లో ఉండే జంతువులు రోడ్ల మీదకు వచ్చి ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని జంతువులు వాటి కడుపు నింపుకునేందుకు జనవాసాల్లోకి వస్తే.. ఇంకొన్ని జంతువులు మాత్రం ప్రజలను చంపుతున్నాయి.
ఈ మధ్య అలాంటి దృశ్యాలు తరుచూ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఏనుగు అడవి మధ్యలో రోడ్డుపై వాహనాలను ఆపి కడుపు నింపుకునేందుకు వాహనంలోని వస్తువులను దోచుకెళ్తుంది.
రోడ్డు మధ్యలో నిలబడి వాహనం వెనుక ఉంచిన లగేజీని తనిఖీ చేస్తోంది. తినుబండారాలు దొరక్క మరో వాహనం వైపు తిరుగుతూ కనిపిస్తుంది. ఆహారం కోసం ఆ ఏనుగు తపన పడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది.
Advertisements
వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాన్ని చూసిన నెటిజన్లు పొట్టకూటి కోసం జంతువులకు కూడా తిప్పలు తప్పడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. కారును ఆపిన ఏనుగు మాత్రం డ్రైవర్ భారీ నష్టాన్నే మూటగట్టింది.