బింబిసార సినిమా సూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీతో ఆడియన్స్ కి హాయ్ చెప్పారు.అయితే ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేక పోయింది.
కళ్యాణ్ రామ్ ఎప్పటిలాగా చాలెంజింగ్ గా తీసుకుని మరో సినిమాలో నిమగ్నమయ్యారు. రెట్టించిన కసితో నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న డెవిల్ మూవీకి దగ్గరయ్యారు. హై బడ్జెట్గా రూపొందుతున్నఈ సినిమాలో మాళవిక నాయర్ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనుంది.
ఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్ కోసం ఇరానియన్ బ్యూటీ ఎల్నాజ్ నోరౌజీని తీసుకున్నారని తెలిసింది. ఈ సాంగ్ కోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
హైదరాబాద్లో ఈ సినిమా షూట్ జరుగుతోంది. అభిషేక్ పిక్చర్ సంస్థ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. హర్షవర్దన్ రామేశ్వర్ మ్యాజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.