ట్విట్టర్ నూతన సీఈవో ఇతనే అంటూ ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సీఈవో చైర్‌లో మనిషికి బదులు ఓ కుక్కను కూర్చోబెట్టి ఆయన షేర్ చేసిన ఫోటోపై భారతీయులు ఫైర్ అవుతున్నారు. పరాగ్ అగర్వాల్‌ను పరోక్షంగా అవమానిస్తూ ఆయన చేసిన ట్వీట్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఇంతకు ట్వీట్ లో ఏముందంటే… మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకికి సీఈవో అని రాసి వున్న టీ షర్ట్ తొడిగి దాన్ని సీఈవో చైర్‌లో కూర్చోబెట్టాడు. ట్విట్టర్ నూతన సీఈవో ఇతనే అంటూ ఆ ఫోటో షేర్ చేశాడు. గతంలో పని చేసిన సీఈవో పరాగ్ అగర్వాల్ కన్నా తన కుక్క ఫ్లోకీ మెరుగ్గా పని చేస్తుందన్నారు.
ట్వీట్ పై నెటిజన్లు మండి పడుతున్నారు. ప్రపంచ కుబేరుడిగా ఎదిగినా సంస్కారంలో దిగజారి పోయావంటూ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ట్విట్టర్ డీల్ సమయంలో మస్క్‌కు పరాగ్ అగర్వాల్ కు మధ్య వివాదం తలెత్తింది. ట్విట్టర్ డీల్ సక్సెస్ కాకుండా పరాగ్ అడ్డుకున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఆ తర్వాత మస్క్ న్యాయ పోరాటం చేశారు. అనంతరం ట్విట్టర్ ను మస్క్ స్వాధీనం చేసుకున్నారు. వెంటనే అగర్వాల్ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్‌ను ఆ పదవుల నుంచి తొలగించారు. వారిపై అప్పుడు మస్క్ తీవ్ర విమర్శలు కూడా చేశారు.