ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలెన్ మస్క్ తన 2007 నాటి భారత పర్యటనను గుర్తు చేసుకున్నాడు. ప్రత్యేకంగా తాజ్ మహల్ పర్యటన తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ట్వీట్ లో పేర్కొన్నాడు.
ఆగ్రాలోని ఎర్రకోటకు సంబంధించిన ట్వీట్ కు బదులిస్తూ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ ఇది అద్భుతంగా ఉంది. దీన్ని నేను 2007లో సందర్శించాను. నేను తాజ్ మహల్ ను కూడా చూశాను. తాజ్ మహల్ నిజంగా ప్రపంచలోనే అద్భుతమైన కట్టడం’ అని ట్వీట్ చేశారు.
దీనిపై ఎలెన్ మస్క్ తల్లి మాయే మస్క్ కూడా స్పందించారు. మస్క్ తాతలు కూడా 1954లో దక్షిణాఫ్రికా నుండి తాజ్ మహల్ ను చూసేందుకు వెళ్లారని ఆమె తెలిపారు.
ఇటీవల ఆయన ఆగ్రా కోట గురించి కూడా ట్వీట్ చేశారు. ఆగ్రా కోట ఆర్కిటెక్చర్ అత్యద్భుతమని ఆయన కొనియాడారు. భారత పర్యటన అద్భుతమని గుర్తు చేసుకున్నారు.