సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను టెస్లా సంస్థ సీఈవో ఎలన్ మస్క్ కొనుగోలు చేశారు. తాజాగా ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లు( 3.37 లక్షల కోట్ల)కు చేజిక్కిచ్చుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ ధృవీకరించింది.
ప్రపంచ కుబేరులో జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆయన ట్విట్టర్ లో 9.2శాతం వాటాను రెండు వారాల క్రితమే కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సంస్థలోని పూర్తి వాటాను కొనుగోలు చేయడం గమనార్హం.
ఈ డీల్ విషయంలో ఎలెన్ మస్క్, ట్విట్టర్ ల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 46.5 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎలెన్ మస్క్ ప్రకటించారు.
ట్విట్టర్ ను ఎలెన్ మస్క్ కొనుగోలు చేసినా.. తన ఖాతాను పునరుద్ధరించినా మళ్లీ ట్విట్టర్ లో కొనసాగాలనే ఉద్దేశం తనకు లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను ప్రారంభించిన ట్రూత్ అనే సామాజిక మాధ్యమాన్ని అభివృద్ది చేసేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు.