నెలల తరబడి, చెప్పులరిగేలా తిరిగిన కనీసం రూ. లక్ష రుణం ఇచ్చేందుకు సవాలక్ష షరతులు పెడుతుంటాయి బ్యాంకులు. అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ బ్యాంకు అధికారులు అసలే బతికేలేని వ్యక్తికి కోటి రూపాలయ రుణం ఇవ్వడం చర్చనీయాంశంమైంది.
భీమవరం గుడిపూడికి చెందిన ఆరేటి జగన్మోహనరావుకు 2012లో మరణించారు. తుందుర్రులో ఆయనకు కొంత వ్యవసాయ భూమి ఉంది. ఇటీవల ఆయన భార్య అరుణ అవసరం నిమిత్తం రుణం కోసమని భీమవరంలోని ఆంధ్రా బ్యాంకుకు వెళ్లారు. ల్యాండ్ పాస్‌బుక్‌కు తనఖా పెట్టాలని అనుకున్నారు. ఆ పాస్‌బుక్‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఆల్‌రెడీ ఆ భూమిపై లోను ఉందని ఆమెకు చెప్పడంతో ఈసారి ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. చేపల చెరువు కోసమని 2015లో మరో బ్యాంకు రూ.కోటి రుణం మంజూరు చేశారని బ్యాంకు అధికారులు వివరించారు.
అరుణ వెంటనే.. కోటి రూపాయల రుణం మంజూరు చేసిన బ్యాంకుకు వెళ్లి అదికారులను నిలదీసింది. అయితే వారు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆమె ఏలూరు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.