ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. విజయవాడ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. 30 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా..వారిలో సుబ్బరావమ్మ, అప్పారావులు మృతి చెందారు. దీనిపై డాక్టర్లను సంప్రదించగా సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు ఊపిరితిత్తుల సమస్యతో మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో జనం బాధపడుతూన ఉన్నారు. కొందరు వెంటనే కోలుకంటున్నప్పటికీ స్థానికుల్లో భయం మాత్రం పోవటం లేదు. బుధవారం తర్వాత కొత్త కేసులేమీ నమోదు కాలేదు. వింత వ్యాధితో బారినపడ్డ వారి సంఖ్య 587కు పెరగ్గా, 511మంది కోలుకున్నారు. 43మంది జిల్లా ఆసుపత్రిలో, మరో 33మంది విజయవాడలో చికిత్స పొందుతున్నారు.
ఏలూరులో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి… వ్యాధి లక్షణాలు కనపడ్డ వారికి వైద్య సహయం చేస్తున్నారు.