ఏలూరు ఇప్పటి వరకు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వాళ్ళ సంఖ్య 611కి చేరింది. కాగా వారిలో 569 మంది డిశ్చార్జ్ అయ్యారు . మిగిలిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే 11వ తేదీ శుక్రవారం మొత్తం 5 మంది మాత్రమే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. కాగా ఇప్పటి వరకు 34 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ, గుంటూరు తరలించారు. అయితే వింత వ్యాధితో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారిలో ఇప్పటివరకు 3గురు మృతిచెందారు.