ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ నుండి బాధితులు డిశ్చార్జ్ అవుతున్నారు. శనివారం అర్ధరాత్రి డాక్టర్ల బృందం పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆరోగ్యంగా ఉన్న 20 మంది బాధితులను డిశ్చార్జ్ చేశారు.
అనారోగ్యానికి గురై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం సదుపాయం కల్పించాలని మంత్రి ఆళ్ల నాని ఆసుపత్రి వైద్యులను కోరారు. బాధితులకు ఇంచార్జి డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎ వి ఆర్ పర్యవేక్షణలో వైద్యుల బృందం ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తుంది.
ఏలూరులో అనారోగ్యానికి గురైన ప్రాంతాలలో ప్రత్యేకంగా మెడికల్ టీంలు, ఇంటింటి సర్వే చేపట్టారు.
పిట్స్ లక్షణాలతో ఏలూరులో దాదాపు 25మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ఆసుపత్రికి పంపించారు. అయితే ఇది ఎందుకు జరిగింది…? అన్న కారణాలను విశ్లేషిస్తున్నారు.