జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. అవంతి పురా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. రాజ్ పొరా ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో పోలీసులు, భద్రతా దళాలు కార్టన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసుల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. మృతులను థ్రాల్‌కు చెందిన షాహిద్ రాథర్, షోపియాన్‌కు చెందిన ఉమర్ యూసుఫ్‌గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్ కావడం గమనార్హం. సోమవారం పుల్వామాలో భద్రతాలకు, ఉగ్రవాదులకు మద్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో జైషే మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.