జమ్మూకాశ్మీర్ చిత్రగామ్ లో ముష్కరుల కాల్పులకు ప్రతీకారం తీర్చుకున్నాయి భారత బలగాలు. ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. బుధవారం రాత్రి ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు.
భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి వేట కొనసాగించాయి. రాత్రి నుంచి సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగింది. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని హతమార్చారు భారత సైనికులు. చనిపోయిన ఉగ్రవాది అనాయత్ అహ్మద్ గా గుర్తించారు. అతని దగ్గర ఉన్న గన్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కొద్దిరోజులుగా దక్షిణ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా చిత్రగామ్ లో ఉగ్ర కదలికలు ఎక్కువయ్యాయి. దీంతో భద్రతా బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి.