జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. ముష్కరులు తల దాచుకున్న ప్రదేశాలపై నిఘా వర్గాలకు సమాచారం రావడం ఆలస్యం యాక్షన్ షురూ అవుతోంది. తాజాగా బందిపొరలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిపారు మన సైనికులు.
ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాల్ని జమ్మూకాశ్మీర్ పోలీసులు వివరించారు. చనిపోయిన ఇద్దరు ఏ సంస్థకు చెందినవారో తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వారి నుంచి కొంత మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.